11-04-2025 12:00:00 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్
చెన్నూర్, ఏప్రిల్ 10 : చెన్నూర్ మున్సిపాలిటీలో అధికారులకు ప్రజల నుంచి పన్నుల వసుళ్లపై ఉన్న శ్రద్ధ వారికి వసతులు కల్పించడంలో లేదని బీజెపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోగావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని తొమ్మిదవ వార్డులో చోట హనుమాన్ మం దిర్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.
గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయిన తర్వాత సుమారు 5 సంవత్సరాలలో దాదాపు పది మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీపై వెళ్లారు కానీ ప్రస్తుతం ఉన్న దుర్భర పరిస్థితిలు లేవన్నారు. గత కమిషనర్లకు భిన్నంగా పేద ప్రజల వద్ద పన్ను వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ పట్టణంలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పనలో ఎందుకు లేదని ఆయన విమర్శిం చారు.
బడా నాయకులను l, బడా వ్యాపా రస్తులను వదిలిపెట్టి పేద ప్రజల వద్ద ఇంటికి తాళాలు వేస్తానని బెదిరించి పన్నులు వసూ లు చేసిన ఘనత స్థానిక మున్సిపల్ కమిషనర్‌కి దక్కుతుందని అన్నారు. స్థానిక ఎమ్మె ల్యే మెప్పు పొందడానికి అతి ఉత్సాహాన్ని మున్సిపల్ అధికారులు ప్రదర్శించారని ఆయన అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే సోదరుడు గడ్డం వినోద్ మంత్రిగా ఉన్న సమయంలో చెన్నూరు పట్టణానికి కోటిలింగాల వద్ద నాలుగు కోట్ల రూపాయలతో ట్యాంక్ నిర్మాణం చేసి ప్రజలకు గోదావరి నీళ్లు అందిస్తామని వాగ్దానం చేశారని, ఆ మంచినీటి పథకము ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదని ఆయన గుర్తు చేశారు.
పట్టణంలో ప్రస్తుతం నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు తో కలిపితే 12 నీళ్ల ట్యాంకులు ఉన్నాయని, ఒక్క ట్యాంక్ నుంచి కూడా బిందెడు నీళ్లు రావడం లేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్, మాజీ కౌన్సిలర్ కమల శ్రీనివాస్, కేవీఎం శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు గర్రెపల్లి వెంకట నరసయ్య, తుమ్మశ్రీ పాల్, మహిళా మోర్చా నాయకురాలు ఎడ్ల స్వరూప రాణి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏతం శివకృష్ణ, మాజీ పట్టణ అధ్యక్షుడు కొరకుప్పల వంశి గౌడ్ తలారి రాజులు, నాయకు లు మౌనిక రౌతు శంకర్, కొత్తూరి దుర్గ ప్రసాద్, పిల్లల మర్రి రాజబాపు తదితరులు పాల్గొన్నారు.