calender_icon.png 2 April, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగుగు శ్రీపాదసాగర్ జలాలు

29-03-2025 01:40:19 AM

  • 12 ఏండ్ల చరిత్రలో తొలిసారి విడుదల
  • ౩౦ రోజులుగా మండటెండల్లో పంటలకు సాగునీరు
  • మంత్రి శ్రీధర్ బాబు ఆదేశంతో అందుతున్న నీరు 
  • ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి రైతుల కృతజ్ఞతలు

ముత్తారం మార్చి 28 (విజయక్రాంతి) ముత్తారం మండలంలో మండు టెండల్లో రైతులకు శ్రీ పాద సాగర్ ప్రాజెక్టు-2 టిఎంసీ నుండి సాగునీరు అందుతుంది. రైతుల పం టలు ఎండిపోకుండా మంత్రి శ్రీధర్ బాబు ఆదేశంతో అధికారుల పర్యవేక్షణలో 12 ఏండ్ల చరిత్రలో ఏనాడు అందని విధంగా 30 రోజులుగా నిరంతరం శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు-2 టిఎంసి ద్వారా సాగు నీరు అందుతున్నాయి.

ముత్తారం మండలంలోని మచ్చుపేట, మైదంబండ హరిపురం, కేశనపల్లి దర్యాప్తుర్, అడవి శ్రీరాంపూర్ గ్రామా లకు సాగునీరు అందించాలని నెల రోజుల క్రితం రైతులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరగా వెంటనే స్పందించిన మంత్రి రైతుల పొలాలు ఎండిపోకుండా నిరంతరం సాగునీరు అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించడంతో అధికా రుల పర్యవేక్షణలో 12 ఏళ్లలో ఎన్నడు లేని విధంగానే గత 30 రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నారు.

దీంతో రైతులు పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించిన మంత్రి శ్రీధర్ బాబు కు సహకరించిన శ్రీనుబాబుకు, నాయకులు చొప్పరి సదానందం కు బాలాజీ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.