calender_icon.png 16 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూలుపండ్ల వేడుక పూర్తి

09-08-2024 12:05:00 AM

టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. వీరి నిశ్చితార్థం గురువారం జరిగింది. నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీనియర్ నటుడు నాగార్జున ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకున్నారు. ‘నా కొడుకు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవటం ఆనందంగా ఉంది. మా కుటుంబంలోకి శోభితను ఆనందంగా ఆహ్వానిస్తున్నాం.

కొత్త జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చారు నాగార్జున. చైతన్యకు గతంలో సమంతతో పెళ్లయి, విడాకులైన సంగతి తెలిసిందే. శోభితతో కొంత కాలంగా స్నేహం చేస్తున్న చైతన్య ఆమెను రెండో పెళ్లి చేసుకోనున్నారు. ప్రస్తుతం చైతన్య వయసు 37 కాగా, శోభిత 32 ఏళ్ల యువతి. ఏపీలోని తెనాలి ఆమె తల్లిదండ్రుల స్వస్థలం.