calender_icon.png 6 November, 2024 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టులకు మొదలైన వరద.. నాలుగురోజులు భారీ వర్షాలు

19-07-2024 02:45:45 AM

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): తెలంగాణలో రాగల 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య ఆనుకొని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీనడం ఏర్పడిందని దీని ప్రభావంతో శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌లలో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

గురువారం నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌లో భారీ వర్షాలు పడగా కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో ఒక మోస్తరు వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట, జనగాం, పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో వివిధ ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు సంబంధిత శాఖ అందించిన వివరాల మేరకు ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు ఇలా ఉన్నాయి.