calender_icon.png 10 January, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా తెప్పోత్సవం

10-01-2025 12:55:41 AM

తిలకిస్తూ పరవశించిన భక్తజనం

భద్రాచలం, జనవరి 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గురువారం సాయం త్రం పావని గోదావరి నదీ తీరంలో రామ య్య తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.

ప్రధాన రామాలయం నుంచి సీతా, లక్ష్మణ సమేత రామచందయ్రస్వామి వారిని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా గోదావరి నది తీరంలో గల హంస వాహనం వద్దకు తీసుకెళ్లారు. నది విహారం చేసి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. గోదావరి తీరమంతా జనసంద్రమైంది.

తెప్పోత్సవంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర హౌసింగ్ ఎండీ విపి గౌతమ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహూల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, రామలయ ఈవో రమాదేవి, ఆర్డీవో దామోదర్‌రావు పాల్గొన్నారు.

అమ్ముడుపోయిన ఏకాదశి టిక్కెట్లు 

భద్రాచలంలో నేడు మిథిలా స్టేడియం వద్ద  జరిగే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో భారీగా అమ్ముడుపోయాయి. మొత్తం ఆరు సెక్టార్లకు 1,496 టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టగా గురువారం సాయంత్రానికి 1,199 టికెట్లు అమ్ముడుపోయాయి.