calender_icon.png 16 January, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతి వెలగలేదు

09-08-2024 02:41:39 AM

రెపిచేజ్ రౌండ్‌లో ఓడిన భారత అథ్లెట్

పారిస్: ఒలింపిక్స్‌లో తెలుగు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ యర్రాజీ జ్యోతి తన ప్రదర్శనతో నిరాశపరిచింది. మహిళల 100 మీటర్ల హార్డి ల్స్ రెపిచేజ్ రౌండ్‌లో జ్యోతి నాలు గో స్థానంలో నిలిచింది. గురువా రం జరిగిన రెపిచేజ్ రౌండ్‌లో జ్యోతి గమ్యాన్ని 13.17 సెకన్లలో పూర్తి చేసింది. ప్రతీ రెపిచేజ్ నుంచి టాప్‌ే నిలిచిన అథ్లెట్లు మాత్ర మే సెమీస్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 100 మీట ర్ల హార్డిల్స్‌లో 40 మంది అథ్లెట్లు పోటీ పడగా.. రెపిచేజ్ రౌండ్ అనంతరం జ్యోతి 16వ స్థానంతో సరిపె ట్టుకుంది. బుధవారం జరిగిన హీట్ రేసులో జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్‌ను 13.16 సెకన్లలో పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రి కా అథ్లెట్ మారినే (12.79 సెకన్లు), డచ్ అథ్లెట్ మాకే జిన్ 912. 87సెకన్లు) సెమీస్‌కు చేరుకున్నారు.