calender_icon.png 29 April, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి వైపు నడిపించిన జెండా.. బీఆర్‌ఎస్

28-04-2025 12:41:57 AM

పార్టీ జెండా ఆవిష్కరణలో కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్‌రెడ్డి 

- రజతోత్సవ సభకు తరలిన పార్టీ శ్రేణులు

జడ్చర్ల  ఏప్రిల్ 27 :  స్వరాష్ట్ర సాధన కోసమే ఏర్పడి, రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి వైపు నడిపించిన జెండా బి.ఆర్.ఎస్ అని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు . బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.  అనంతరం వరంగల్ లో జరుగుతున్న బి.ఆర్. ఎస్ రజోత్సవ సభకు పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు.  కుమారస్వామి శ్రీనివాస్ యాదవ్ , గడ్డిరాజు, గోపాల్ రెడ్డి, ప్రవీణ్, ప్రసాద్, శ్రీను, నారాయణ, రవికాంత్, సుభాష్ పాల్గొన్నారు.