* ఎగనామం పెట్టిన అధికారులు
* రైతు వేదికల వద్ద కనిపించని జెండా పండుగ
* అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న రైతులు
కోనరావుపేట, జనవరి 26 : రైతు వేదికల వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కనిపించలేదు. ఆదివారం కోనరావుపేట మండలంలోని ప్రతి గ్రామం తో పాటు వాడ వాడల మొబైల్ లెజెండ్ ఎగురవేయగా, వ్యవసాయ అధికారులు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించారు. ప్రతి ఏటా రైతు వేదికల వద్ద జెండా వందనం నిర్వహించగా ఈసారి మాత్రం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
దీంతో రైతు వేదికలకు వచ్చిన రైతులు జెండా వందనం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కోనరావుపేట తోపాటు నిజామాబాద్ గ్రామాల్లోని రైతు వేదికల వద్ద మాత్రమే జెండాలు ఎగురవేసి, మిగతా గ్రామాలైన సుద్దాల, కొలనూర్, బావుసాయిపేట నిమ్మపళ్లి రైతు వేదికల వద్ద జాతీయ జెండాను ఎగరవేయలేదు.
రాజన్న గొల్లపల్లి గ్రామంలో 4 సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం ఉన్నందున, అక్కడ డ్యూటీ వేయడంతో జెండా ఎగరవేయ లేదని మండల వ్యవసాయ అధికారి సందీప్ పేర్కొన్నారు. కోనరావుపేట, నిజామాబాద్ గ్రామాల్లో డ్యూటీ ఉండగా ఇక్కడ ఎలా జెండాను ఎగరవేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాను అవమాన పరచడమే కాకుండా విధుల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చర్యలు తీసుకోవాలని సోమ శెట్టి నాగరాజు, కోరవేణి రవి, కాదాసు అంజయ్యలు కోరారు.