calender_icon.png 31 January, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మువ్వన్నెల జెండా మురిసింది

27-01-2025 12:38:46 AM

  • ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ సంబురాలు
  • త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు 

గద్వాల, జనవరి 26 ( విజయక్రాంతి ) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో  గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా  జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పుర ప్రముఖులను, అధికార,అనధికారులను కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకునేందుకు భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చి,

భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించిందని అన్నారు. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ఆహుతులను అలరింపజేశారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ  శాఖలలో పని చేసి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 25.45 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల చెక్కును అందజేశారు.

తదనంతరం డీఆర్డీఏ, వ్యవసాయం, ఆరోగ్యం, ఐసిడీఎస్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్, విద్యా తదితర వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్సు అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  శ్రీనివాస రావు, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ  మోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, వీరభద్రప్ప, మార్కెట్ యార్డ్ చైర్మన్ నల్ల హనుమంతు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక  ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకమైన ప్రజాపాలనే లక్ష్యం 

వనపర్తి, జనవరి 26 ( విజయక్రాంతి ) :  జిల్లాలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తూ,  పారదర్శకమైన ప్రజాపాలనను అందించి, వారి ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు.

ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా జిల్లా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి, వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై ఉపన్యసించారు.

అనంతరం స్వాతంత్ర సమరయోధురాలు సీతమ్మను శాలువా తో సత్కరించారు. వేదికపై జిల్లా ఎస్పీ  గిరిధర్ రావుల, స్థానిక శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వివిధ పాఠశాలల విద్యార్థుల దేశభక్తి నృత్య సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

అదేవిధంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  శకటాల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. అదేవిధంగా, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్సును కలెక్టర్ తిలకించారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సిబ్బందికి కలెక్టర్, అదనపు కలెక్టర్లు, శాసనసభ్యులు  ద్వారా ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని 2646 మహిళా సంఘాలకు, బ్యాంకు లింకేజీ రుణాల రూ. 246 కోట్ల చెక్కును కలెక్టర్ అందజేశారు. 

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలి.

వనపర్తి టౌన్‌జనవరి-26: పోలీసు కార్యాలయంలో  ఆదివారం ఉదయం  జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి  జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ   మాట్లాడుతూ. పోలీసు ఉద్యోగం రావడం అదృష్టంగా భావించి సక్రమంగా విధులు నిర్వహించి, ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. ప్రజల్లో పోలీసు అధికారులు సిబ్బంది మమేకమై విధులు నిర్వహించినప్పుడే, ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతుందని తెలిపారు. 

జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో   జిల్లా సాయుధ దళ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ, సునందన, వనపర్తి సిఐ కృష్ణయ్య రిజర్వే ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీస్ అధికారులు సిబ్బంది, పోలీస్  కార్యాలయ సిబ్బంది మరియు ఎఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పెరేడ్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ సంతోష్

నాగర్ కర్నూల్ జనవరి 26 (విజయక్రాంతి) : 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామ గ్రామాన వాడవాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఎగిరింది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు,  ఆసుపత్రులు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జాతీయ జెండాను ఆవిష్క రించారు.

మొదటగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో పాటు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ప్రగతి నివేదన పత్రాన్ని ప్రజలకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు జిల్లాలోని ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం, సహకారం ఎంతో అవసరమ న్నారు.

విద్య, వైద్యం, సంక్షేమం, అటవీ, వెటర్నరీ, ఫైర్ వంటి శకటాల ప్రదర్శన అందర్నీ కట్టిపడేసాయి. అంతకు ముందు జిల్లాలోని ఆయా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల చేత చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. దేశభక్తి, తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు, రోడ్డు భద్రత వంటి కార్యక్రమాలపై విద్యార్థులు తమ నృత్య ప్రదర్శన ద్వారా అందరికి వివరించారు.

అనంతరం స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకొని స్వాతంత్ర పోరాటంలోని భాగస్వాములైన వారిని శాలువాతో సన్మానించి సత్కరించారు. ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి మున్ముందు మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు అందేలా ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పోలీస్ ఫైర్ తదితర శాఖలో సేవ రత్న ప్రశంసా పత్రాలను ఉద్యోగులకు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ ప్రథమ, విజయ, తృతీయ బహుమతులను అందజేశారు. 

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ప్రజాసంఘాల కార్యాలయంలో.. 

మహబూబ్ నగర్ జనవరి 26 (విజయ క్రాంతి) : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా సంఘాల కార్యాలయంలో ఆ కార్యాలయ బాధ్యులు జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జాతీయ జెండా ఎగరవేశారు.

జిల్లా కేంద్రంలోని ఫరేడ్ మైదానం నందు జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల అధికారులకు ఆ వార్డులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రధానం చేశారు. అంతకుముందు వివిధ కార్యాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ శకటాలు ప్రదర్శించబడ్డాయి. కలెక్టరేట్ లో సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. రి వేడుకలకు జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.