హైదరాబాద్ సిటీబ్యూరో: ఖైరతాబాద్ ఐమాక్స్ సమీపంలో ఈ నెల 21 నుంచి జరుగుతున్న మత్స్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చేపలతో తయారు చేసిన వివిధ వంటకాలను పరిశీలించారు. అనంతరం ఉత్తమ మత్స్యకారులుగా ఎంపిక వారికి మెమొంటోలు ప్రధానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పాల్గొన్నారు.