calender_icon.png 31 October, 2024 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలివారం ఎమోషన్‌తో గడిచింది

04-08-2024 12:19:07 AM

చెఫ్ దె మిషన్ గగన్ నారంగ్

పారిస్: విశ్వక్రీడల్లో భారత షూటర్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని ‘చెఫ్ దే మిషన్’ గగన్ నారంగ్ అభిప్రాయపడ్డాడు. భారత ఒలింపిక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి షూటింగ్‌లో మూడు పతకాలు రావడం గొప్ప విషయమ న్నాడు.‘ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్ చరిత్ర చూసుకున్నట్లయితే ఇదే షూటర్ల అత్యుత్తమ ప్రదర్శన. పారిస్‌లో ఎమోషన్స్‌తో కూడిన మొదటి వారం గడిచింది. భారత్ తరఫున మన షూటర్స్ పతకాలు సాధించి దేశం గర్వంగా తలెత్తుకునేలా చేశా రు. మనూ, సరబ్‌జోత్, స్వప్నిల్‌లను చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. వీరు మాత్రమే కాకుండా అర్జున్ బబౌటకు పతకం రానప్పటికి అతడి ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా’ అని గగన్ పేర్కొన్నాడు.