calender_icon.png 25 October, 2024 | 3:55 AM

ముగిసిన తొలి థర్మల్ కేంద్రం శకం

06-08-2024 04:29:53 AM

  1. కేటీపీఎస్ కర్మాగారంలో 8 కూలింగ్ టవర్లు కూల్చివేత 
  2. 58 ఏళ్ల క్రితం ప్రారంభించిన నాటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయి 
  3. రూ.40కోట్లతో జపాన్ పరిజ్ఞాణంతో నిర్మాణం 
  4. కాలం చెల్లడంతో కూల్చివేసిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వం చలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) ఓఅండ్‌ఎం కర్మాగారం  శకం సోమవారంతో ముగిసింది. పాతప్లాంట్‌కు చెందిన 8 కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా కూల్చివేశారు. ఒక్కొక్క కూలింగ్ టవర్ 102 అడుగులు ఎత్తు ఉంటుంది. జోన్‌కో అధికారుల పర్యవేక్షణ లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వాటిని నేలమట్టం చేశారు. 1966లో జపాన్ టెక్నాలజీతో 8యూనిట్లతో 720 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన బొగ్గు ఆధారి త కర్మాగారం ఇది. కాలం చెల్లడంతో సెంట్ర ల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆదేశాల మేరకు కూల్చివేతను రెండు సంవత్సరాల క్రింతం ప్రారంభించారు. 

కాలం చెల్లడంతో కూల్చివేత..

58 సంవత్సరాలు కావడంతో కాలం చెల్లిపోయి, అధికంగా వాతావరణ కాలుష్యానికి కారణమవుతుండటంతో సెంట్రల్  ఎలక్ట్రిసి టీ అథారిటీ ఆదేశాల మేరకు జెన్‌కో యాజమాన్యం కూల్చివేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ 2 సంవత్సరాలుగా సాగుతోం ది. చివరి అంకంగా కూలింగ్ టవర్ల కూల్చివేత సోమవారం పూర్తి చేశారు. ఇప్పటి వరకు వేలాది మంది కార్మికులకు వెలుగు చూపిన కర్మాగారం ఇక లేదనే విషయాన్ని కార్మికులు జీర్ణించుకోలేక పోతున్నారు. తొలి థర్మల్ కేంద్రం కథ ముగిసినట్లుంది. 

బీ స్టేషన్.. రెండు యూనిట్లు

కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారానికి చెం దిన బీ స్టేషన్‌ను 5, 6 యూనిట్లతో రూ. 51.73కోట్లతో పూర్తి చేసి, 1974 ఆగస్టు 13న 5వ యూనిట్, అదే సంవత్సరం డిసెంబరులో 6వ యూనిట్‌ను ప్రారంభించారు. ఒక్కో యూనిట్ 120 మెగావాట్ల చొప్పున బీ స్టేషన్ నుంచి 240 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. 

సీ స్టేషన్.. రెండు యూనిట్లు

కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారానికి చెం దిన సీ స్టేసన్ 7, 8 యూనిట్లతో రూ.77.77 కోట్లతో నిర్మించారు. 1977 మార్చి 10న 7వ యూనిట్, 1978 జనవరి 10న 8వ యూనిట్‌ను ప్రారంభించారు. ఒక్కొక్క యూనిట్ నుంచి 120 మెగావాట్లతో మొ త్తం 240 మెగావాట్ల ఉత్పత్తి జరిగేది. 

40మెగావాట్ల సామర్థ్యం.. 4 యూనిట్లు

బొగ్గు ఆధారంతో విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ కర్మాగార నిర్మాణాన్ని 1966, జూలై 4న రూ.40 కోట్లతో ప్రారంభించారు. జపాన్ పరిజ్ఞాణంతో 40 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లతో నిర్మాణం చేపట్టారు. 1967 జూలై 15న అప్పటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయి ప్రారంభించి, జాతికి అకింతం చేశారు. అప్పటి నుంచి 160 మెగావాట్ల విద్యుత్తును దేశ అవసరాలకు అందిస్తూ వచ్చింది.  ఆ తర్వాత దాన్ని రీడిజైన్ చేసి ఒక్కో యూనిట్ 60 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా మార్పు చేశారు. అప్పటి నుంచి 240 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని దేశ అవసరాలకు అందించింది. ఆ తర్వాత మూడు స్టేషన్లుగా, 8 యూనిట్లతో 720 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే కర్మాగారంగా అభివృద్ధి చెందింది.