calender_icon.png 28 February, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భవితకు మొదటి అడుగు పదో తరగతి

26-02-2025 12:19:32 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

పాల్వంచ, ఫిబ్రవరి 25 : విద్యార్థులకు భవిష్యత్తులో వేసే మొదటి అడుగుప్రారంభం అయ్యేది పదవ తరగతిలో సాధించిన మార్కులతోటే ఆధారపడి ఉంటుందని, శ్రద్ధగా చదివి పరీక్షలు బాగా రాసి అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించినప్పుడే మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. మంగళవారం  పాల్వంచ మండలం లోని ఉల్వనూరు  గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించి పదో తరగతి విద్యార్థినిలతో కలిసి ఇంగ్లీష్ సబ్జెక్టు సంబంధించిన పాఠ్యాంశాలను తరగతి గదిలో కూర్చుని పరిశీలించారు.

అనంతరం పదో తరగతి విద్యార్థినిలతో  ప్రత్యేకంగా సమావేశమై పరీక్షలలో పాటించవలసిన మెలకువల గురించి సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం కిన్నెరసాని లోని ఆశ్రమ పాఠశాలలో వేదిక్ మాథ్స్ తరగతిని ఉపాధ్యాయురాలు విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించి పిల్లల చేత బోర్డుపై వ్రాయించి సంతృప్తి వ్యక్తం చేసిన అనంతరం ఆయన పిల్లలకు  సూచనలు ఇస్తూ గణితం సబ్జెక్టు పై భయాన్ని పోగొట్టడానికి వేదిక్ మ్యాథ్స్ను ప్రవేశపెట్టడం జరిగిందని, పిల్లలు తప్పనిసరిగా లెక్కలు ఎలా చేస్తున్నది సంబంధిత టీచర్ గమనిస్తూ ఉండాలని, పిల్లల క్లాసులో నేర్చుకున్నదే గాక ఇంటికి పోయి ప్రాక్టికల్ గా చేయాలని అన్నారు.

ఉదయం సాయంత్రం సూపర్వుజర్ స్టడీ అవర్స్ లో వేద గణితం సంబంధించిన ప్రాక్టీస్ పిల్లల చేత సంబంధిత హెఎంలు చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఏటీడీవో చంద్రమోహన్, ఉలవనూరు హెఎం విజయలక్ష్మ కిన్నెరసాని హెఎం రామారావు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.