పారిస్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం చైనా ఖాతాలో చేరింది. షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీం విభాగంలో చైనా షూటర్లు హువాంగ్ యుటింగ్, షెంగ్ లియావో జోడీ స్వర్ణంతో మెరిసింది. ఇక మహిళల డైవింగ్‌లో చైనాకు చెందిన వైఎన్ చాంగ్, వైడబ్ల్యూ చెన్‌లు స్వర్ణం గెలిచి చైనాకు రెండో పసిడి అందించారు. ఆస్ట్రేలియా స్వర్ణంతో, గ్రేట్ బ్రిటన్ రజతంతో ఖాతా తెరిచింది. అమెరికా, కొరియాలు రజతంతో.. కజకిస్థాన్ కాంస్యంతో పతకాల బోణీ కొట్టాయి.