పెబ్బేరు, జనవరి 2: పదో తరగతి జీవితానికి తొలిమెట్టు లాంటిదని కాంగ్రెస్ యువ నాయకులు లక్ష్మణ్ నాయుడు అన్నారు. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిం చేందుకు ప్రధానోపాధ్యాయులు రమేష్ గురువారం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. విద్యార్థు లకు ఉదయం 8గంటలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
2000సవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు లక్ష్మణ్ నాయుడు తన మిత్ర బృందం పదవ తరగతి పరీక్షల వరకు విద్యార్థులకు టిఫిన్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. పూర్వ విద్యార్థులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, కర్ణ చారి, వడ్ల రాము, ప్రభాకర్ గౌడ్, భాస్కర్, నిరంజన్, బాలరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.