calender_icon.png 28 November, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఆర్ కెమెరాతో తీసిన తొలి పాట!

28-11-2024 12:57:54 AM

రామ్ చరణ్ , శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రం నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై మంచి సక్సెస్ సాధించాయి. ఇవాళ మూడో పాట విడుదల కానుంది. ‘నానా హైరానా’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేయనుంది. ఐఆర్ కెమెరాతో షూట్ చేసిన తొలి ఇండియన్ సాంగ్ ఇదే కావడం విశేషం.

తాజాగా సంగీత దర్శకుడు తమన్‌తో దర్శకుడు శంకర్ జరిపిన ఇంటర్వ్యూలో ఈ పాట గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “ప్రేమలో ఉన్నప్పుడు ప్రతిదీ కలలాగే అనిపిస్తుంది. ప్రపంచమంతా రంగులమయంగా కనిపిస్తుంది. అప్పుడే ఈ పాటను ఇన్‌ప్రారెడ్ కెమెరాతో షూట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే చేశాం.

అయితే నటీనటుల స్కిన్ టోన్ ఎలా వస్తుందన్న ఆందోళన కొంత ఉంది. కానీ పాట చూశాక అద్భుతంగా అనిపించింది. ఆ ప్రదేశమంతా ఓ కలల ప్రపంచంలా అనిపించింది” అని శంకర్ తెలిపారు. ఈ పాటను రామ్ చరణ్, కైరా అద్వానీలపై న్యూజిలాండ్‌లో ఐదు రోజుల పాటు చిత్రీకరించారు.