19-04-2025 12:00:00 AM
కమల్‌హాసన్ నుంచి రాబోతున్న తాజాచిత్రం ‘థగ్‌లైఫ్’. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, ఆర్ మహేంద్రన్, మద్రాస్ టాకీస్, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కమల్‌హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో కనిపించనున్నారు. శింబు, త్రిషకృష్ణన్, ఐశ్వర్యలక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, సన్యా మల్హోత్రా ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. వచ్చే జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ విడుదల చేస్తోంది.
ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. శుక్రవారం చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘జింగుచా’ విడుదలైంది. ఈ పాటకు కమల్‌హాసన్ సాహిత్యాన్ని అందించగా ఏఆర్ రెహమాన్ సమకూర్చిన బాణీలో వైశాలీ సమంత్, శక్తిశ్రీ గోపాలన్, ఆదిత్య ఆర్‌కే ఆలపించారు. పెళ్లి నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట ముఖ్య తారాగణం సందడి చేసింది. హిందీ నటి సన్యా మల్హోత్రా సైతం ఈ పాటలో కనిపించారు. ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది.