14-02-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర ,ఫిబ్రవరి13: గంగాధర మండలం మంగపేట గ్రామపంచాయతీ పరిధిలోని జివిఆర్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు సమావేశంలో భాగంగా మండలం కురిక్యాల నుండి జివిఆర్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పట్టభద్రులు వందలాదిగా బైకు ర్యాలీలో పాల్గొన్నారు.
జఅనంతరం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి వేసి గెలిపించాలని కోరారు. చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, పుల్కం నరసయ్య, మాజీ వైస్ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి, వేముల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, చొప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల యగ్నేష్, తోట సంధ్యా కరుణాకర్, దుబ్బాసి బుచ్చయ్య, బుర్గు గంగన్న, కర్ర విద్యాసాగర్ రెడ్డి,దోర్నాల శ్రీనివాసరెడ్డి, సత్తు కనుకయ్య, పడ్నాల రాజన్న, చక్రపాణి,అట్ల శేఖర్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మల్లేశం చందు, మధు, శంకరయ్య, మ్యాక వినోద్,తదితరులు పాల్గొన్నారు