దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఆ గ్రామానికి మాత్రం రాంపండు దొర ఏలుబడి నుంచి విముక్తి కలుగలేదు. ఆ ఊళ్లో మంచి మనసున్న ఓ యువతి..పేరు దేవుడమ్మ. ఈమె ఓ అనాథ. ఈమెకు రజక యువతి జాబిల్లి, అం ధురాలైన మరో అమ్మాయి స్నేహితురాళ్లు. అదే ఊళ్లో అన్నీ సగం సగం పంచుకునే తండ్రీకొడుకుల తోపాటు చదువు సంస్కారం, సాహసం ఉన్న పూజారి కొడుకూ ఉంటారు.
వీరు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకునేవాటిలో మందు, మగువ కూడా అతీతం కాదు. పూజారి కొడుకు జాబిల్లిని ప్రేమిస్తాడు. అన్నీ దగ్గరుండి చూసుకొని వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తుంది దేవుడమ్మ. అంధత్వం సమస్య ఉన్న పిల్లను తండ్రీకొడుకులు అత్యాచారం చేస్తారు. ఎన్నికల్లో తనకు అడ్డొచ్చిన పూజారి కొడుకును రాంపండు దొర అంత మొందిస్తాడు.
ఇలాంటి నరరూప రాక్షసులను దేవుడమ్మ ఎలా తుదముట్టించిందనేదే ఆ సిని మాలోని పతాక సన్ని వేశం. ఆ చిత్రం పేరు ‘తొలి కోడి కూసింది’. సుప్రసిద్ధ దర్శకుడు కే బాలచందర్ రచనాదర్శకత్వంలో తెరకె క్కిన ఈ సినిమాకు కానూరి రంజిత్‌కుమార్ నిర్మాతగా వ్యవ హరిం చారు. తమిళంలో ‘ఎంగ ఊరు కన్నగి’ పేరుతో రూపొందిందీ సినిమా.
శరత్‌బాబు, సరిత, సీమ, మాధవి ముఖ్య పాత్రలు పోషించారు. జీవా ప్రతినాయకుడిగా నటించారు. ఇందులోని పాటలకు ఆత్రేయ గీత సాహిత్యం అందించగా, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చా రు. అయితే రెండు వెర్షన్లూ ఒకే రోజు అంటే.. 1981, ఫిబ్రవరి 6న విడుదల య్యాయి.
అయితే తెలుగు వెర్షన్ కు మూడు నంది పురస్కారా లు దక్కాయి. అందులో ఒకటి ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజత పురస్కారం కాగా, రెండోది ఉత్తమ ఆడియోగ్రాఫర్‌గా వీ శివరాం ను, మూడో అవార్డు ఉత్తమ పాటల రచయితగా ఆత్రేయను వరించింది.