calender_icon.png 7 January, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే మొట్టమొదటి గాజువంతెన

01-01-2025 01:10:51 AM

* కన్యాకుమారికి మరో ప్రత్యేక ఆకర్షణ 

* వివేకానంద రాక్  తిరువళ్లువర్ విగ్రహంమధ్య నిర్మాణం

చెన్నై, డిసెంబర్ 31: తమిళనాడులోని కన్యాకుమారి వివేకానంద రాక్   తిరువళ్లువర్ విగ్రహం మధ్య అద్భుతం ఆవిష్కృత మైంది. సముద్రం మధ్య త్రివేణి సంగమంలో రాష్ట్రప్రభుత్వం 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో దేశంలోనే మొట్టమొదటి సారిగా గాజు వంతెన నిర్మించింది.

అందుకు రూ.37 కోట్ల నిధులు వెచ్చించింది. వంతెనను చెన్నైకి చెందిన ‘వీఎంఈ ప్రీకాస్ట్ ప్రొడక్ట్స్’ కంపెనీ నిర్మించింది. తిరువళ్లువుర్ విగ్రహావిష్కరణ రజతోత్సవాల సందర్భంగా సీఎం స్టాలిన్ గాజు వంతెనను ప్రారంభించారు.

మంగళ, బుధవారాల్లో వేడుకలు జరగాల్సి ఉండగా సీఎం ఒకరోజు ముందుగానే వంతెన ప్రారంభించడం విశే షం. 133 అడుగుల ఎత్తున తిరువళ్లువర్ విగ్రహాన్ని 2000 జనవరి 1న నాటి సీఎం కరుణానిధి ఆవిష్కరించారు.

2004లో వచ్చిన సునామీని సైతం తట్టుకుని విగ్రహం నిలబడింది. కన్యాకుమారిలోని సముద్రం ఒడ్డు నుంచి సూర్యోదయాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. గాజు వంతెన అందుబాటులోకి వచ్చి న తర్వాత పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.