వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్
సింగపూర్: ప్రతిష్ఠాత్మక వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో లిరెన్ భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌ను 42 ఎత్తుల వద్ద ఓడించాడు. తొలి గేమ్‌లో తెల్ల పావులతో బరిలోకి దిగిన 18 ఏళ్ల గుకేశ్ తొలి ఎత్తులో లిరెన్‌పై పైచేయి సాధించినప్పటికీ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు.
నల్లపావులతో బరిలోకి దిగిన లిరెన్ రెండో ఎత్తు నుంచి తన ఆధిపత్యం ప్రదర్శించాడు. నేడు ఇద్దరి మధ్య రెండో రౌండ్ గేమ్ జరగనుంది. డిసెంబర్ 12 వరకు 14 రౌండ్ల పాటు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో భారత్ నుంచి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గాడు.