calender_icon.png 1 April, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగువారి తొలి పండగ... ఉగాది

29-03-2025 11:22:40 PM

మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు..

కల్లూరు (విజయక్రాంతి): తెలుగువారి తొలి పండగ ఉగాదిని ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు సత్యం బాబు  మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రుతువులు మారుతుంటాయని  వాటితోపాటే అవి మనకు పంచిచ్చే అనుభూతులూ మారుతుంటాయని అన్నారు.అందుకే ప్రకృతి ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుందని శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతూ పచ్చగా కళకళలాడుతుంటాయని మనుషులు కూడా తమ మనసులోని చెడు ఆలోచనలను తొలగించి మంచి మనసుతో చిగురించాలని కోరారు.

రుతువుల్లో వసంత రుతువు మనోహరమైనదీ ఆహ్లాదకరమైనది అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకుని తొలిరుతువు గా చెబుతారు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమి. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అదే బ్రహ్మపురాణం.అన్ని తొలిగా వచ్చే ఆ రోజే తెలుగువారి తొలిపండగ ఉగాది. కావున సంవత్సర కాలం పాటు ఆనందంగా జీవించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు సత్యంబాబు,కె.వి.ఆర్,తోట సుబ్బారావు,రాచబోయిన శీను, పసుపులేటి శ్రీనివాసరావు, తాండూ రాములు,రామడుగు పురుషోత్తమ చారి, శ్రీరామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.