ఆదిలాబాద్, (విజయక్రాంతి) : ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరలో మొదటి ఘట్టం శుక్రవారం ప్రారం భమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు శుక్రవారం కేస్లాపూర్‌కి శుక్రవారం సాయంత్రం కాలినడకన చేరుకున్నారు. అందరూ తెల్లని వస్త్రాలు ధరించి, తల పాగలు ధరించి, ఒకరి వెనుక ఒకరు నడుచుకుంటూ కేస్లాపూర్ నుంచి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తలమడుగుకు గోదావరి నది వద్దకు పయనం అయ్యారు.