calender_icon.png 26 November, 2024 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిరోజే వాయిదాల పర్వం

26-11-2024 02:38:57 AM

అదానీ అంశంపై ఉభయ సభల్లో గందరగోళం

బుధవారానికి వాయిదా పడిన ఉభయ సభలు

విపక్షాల డిమాండ్ల నడుమనే మరణించిన ఎంపీలకు సంతాపం

న్యూఢిల్లీ, నవంబర్ 25: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన గంట కే ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డా యి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అంశం రెండు సభలను కుదిపేసింది. ఆయనపై అమెరికాలో నమోదైన కేసుపై చర్చిం చాలని విపక్షాలు పట్టుబట్టాయి. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించి విచారించాలని కాంగ్రెస్ తీర్మా నం ఇచ్చింది.   ప్రతిపక్షాల డిమాండ్‌కు సభాపతులు నిరాకరించడంతో సభల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తొలిరోజు సెషన్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేయాల్సి వచ్చింది. 

ఉభయ సభల్లోనూ..

విపక్షాల డిమాండ్ల మధ్య ప్రారంభమైన లోక్‌సభలో మొదటగా ఇటీవల కాలంలో మరణించిన ఎంపీలకు సభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత అదానీ విషయంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభ కార్యాకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు సభను స్పీకర్ ఓంబిర్లా వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలో అదానీపై అమెరికాలో ఆరోపణల అంశాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి భారత్ మొత్తాన్ని ప్రభావితం చేసిందని, ఈ విషయంలో అదానీకి  ప్రధాని నరేంద్రమోదీ మద్దతుగా నిలుస్తారని ఖర్గే ఆరోపించారు. ఈ అంశంపై సభలో కచ్చితంగా చర్చించాలని డిమాండ్ చేశారు. కానీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ ఇందుకు నిరాకరించడంతో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో రాజ్యసభను సైతం బుధవారానికి వాయిదా వేశారు.