calender_icon.png 17 November, 2024 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి ఏరోస్పైక్ ఇంజిన్ ప్రయోగం సక్సెస్

12-09-2024 02:43:36 AM

బెంగళూరు, సెప్టెంబర్ 11: అంతరిక్ష ప్రయోగాల్లో అత్యాధునికమైన టెక్నాలజీగా చెప్పబడుతున్న ఏరోస్పైక్ ఇంజిన్‌ను బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ విజయవ ంతంగా పరీక్షించింది. భారత్‌లో ఈ తరహా రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించటం ఇదే తొలిసారి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)కి చెందిన స్పేస్ ఫీల్డ్ సంస్థ చిత్రదుర్గ్ జిల్లాలోని చల్లకెరెలో ఉన్న ఐఐఎస్‌సీ ప్రొపల్షన్ టెస్ట్ కేంద్రంలో ఈ రాకెట్ ఇంజిన్‌ను బుధవారం పరీక్షించారు.

ఈ ఇంజిన్ 2 వేల న్యూటన్స్ పీక్ త్రస్ట్‌ను ఉత్పత్తి చేసిందని ఆ సంస్థ తెలిపింది. సంప్రదాయ రాకెట్ ఇంజిన్లను అన్ని వాతావరణ పరిస్థితులు, అంతరిక్షంలోని అన్ని ఎత్తుల్లో వాడటంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ, ఈ కొత్త రకం రాకెట్‌ను ఎక్కడైనా వాడవచ్చు.