calender_icon.png 15 November, 2024 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి ముద్దాయి కేటీఆర్

15-11-2024 12:48:34 AM

  1. ఆయన జైలుకు వెళ్లడం ఖాయం
  2. ఫార్ములారేసు పేరిట ప్రభుత్వ సొమ్ము కాజేస్తే ఊరుకోవాలా ?
  3. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): లగచర్ల కేసులో మొదటి ముద్దాయి కేటీఆరేనని, ఆయన ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పార్టీ నాయకులతో అధికారులపై దాడి చేయించారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో గురు వారం మీడియాతో మాట్లాడారు. 

ఈ కేసు లో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కలెక్టర్‌తోపాటు అధికారులపై దాడి చేసిన వారెవరినీ సర్కార్ విడిచిపెట్టదని స్పష్టంచేశారు. స్వార్థం కోసమే బీఆర్ ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి ఎలాంటి భేషజాలు లేవని, తప్పెవరు చేసినా వారికి శిక్ష పడుతుందని తేల్చిచెప్పారు.

ఫార్ములా రేసు పేరిట బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నొక్కేసిన కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము అని, ఆ సొమ్ము కాజేస్తే సర్కార్ ఎందుకు ఊరుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తాము ఈ నెల 16 నుంచే జిల్లాల పర్యటనకు వెళ్తున్నామని, కరీంనగర్ నుంచే పర్యటన ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.