04-04-2025 01:02:56 AM
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో సన్న బియ్యం పథకం ప్రారంభం
పాపన్నపేట, చిన్నశంకరంపేట, ఏప్రిల్ 3 :పాపన్నపేట, చిన్నశంకరం పేట మండల కేంద్రాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాపన్నపేట మండలానికి సంబందించిన 45 రేషన్ షాపుల గాను 15,556 రేషన్ కార్డులు కలవని దీని ద్వారా 50 వేల 102 కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే శంకరంపేట మండలంలో 25 రేషన్ షాపు లకు గాను 11,411 కార్డుదారులకు 38,662 కుటుంబ సభ్యులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ పథకం నిరుపేదలకు ఒక వరమని, పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామని వివరించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని వినియోగించుకోవాలని, సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం అందిస్తోన్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని, అభివృద్ధి సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రమాదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్ రెడ్డి అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.