calender_icon.png 10 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఖరి సమావేశం... అభివృద్దే లక్ష్యం

09-01-2025 05:39:45 PM

బోడుప్పల్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో రూ.43.37 కోట్ల పనులకు ఏకగ్రీవ ఆమోదం.

సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎం.పి ఈటెల రాజేందర్...

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవీకాలం ముగియనుండడంతో గురువారం చివరి సమావేశం అన్నట్లుగా సర్వ సభ్య సమావేశం హుషారుగా సాగింది. సభ్యులందరూ వారి డివిజన్ సమస్యలను కలిసికట్టుగా వినిపించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు మేయర్ అజయ్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్(MP Etela Rajender) హాజరయ్యారు. నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కార్పొరేటర్ల పదవీకాలం ముగిసినా నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకురావచ్చని అందరం కలిసికట్టుగా చర్చించి పరిష్కరించేందుకు కృషి చేద్దామన్నారు. ఈ సమావేశంలో పలు డివిజన్లలో నూతన డ్రైనేజి నిర్మాణం, నూతన బి.టి, సిసి రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు సుమారు రూ.43.37 కోట్ల పనులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపారు. కమీషనర్ జి. రామలింగం, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్, రెవిన్యూ, విద్యుత్ సంబందించిన అధికారులు పాల్గొన్నారు.