- ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం
- అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్,
- జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి
కొండపాక, ఫిబ్రవరి 4: ఈనెల 7న గ్రామ పంచాయతీల వారీగా తుది జాబితా వెల్లడిస్తామని,ఈ లోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ అమిద్ అన్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవితో కలిసి మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తుది జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా విడుదల చేస్తామన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డ్ వైస్ ఓటరు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఆ సమయంలో కొన్ని కారణాలవల్ల 64 గ్రామపంచాయతీ ఓటర్ జాబితాను ప్రచురించలేదని , ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెండింగ్ లో ఉన్న 17 గ్రామ పంచాయతీల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను తయారుచేసి,3వ తేదీ న గ్రామ పంచాయతీ మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించామన్నారు.
మంగళవారం జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో, బుధవారం జిల్లాలో పెండింగ్ లో ఉన్న సిద్దిపేట రూరల్ 15 గ్రామపంచాయతీ లు కొండపాక అక్కన్నపేట మండలాల్లో ఒక్కొక్క గ్రామపంచాయతీ సంబంధించి పెండింగ్ లో ఉన్న ఓటరు జాబితా పై మండల స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి,
17 గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను అందిస్తామని తెలిపారు.5వ తేదీ వరకు ఆబ్జెక్షన్స్ స్వీకరించి, 6వ తేదీన పరిష్కరించి, 7వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.
ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజకీయ పార్టీలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ అత్ ఇమామ్, గయాసోద్దీన్,
టిఆర్‌ఎస్ పార్టీ మోహన్లాల్, మధుసూదన్ రెడ్డి, బీఎస్పీ బాబు, యాదగిరి, ఉమేష్,రాజు, ఏ ఏ పి పున్నమిరెడ్డి, వైయస్‌ఆర్సీపీ జగదీష్, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.