calender_icon.png 18 January, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్ ఫైట్

28-07-2024 02:54:34 AM

  1. నేడు భారత్, శ్రీలంక అమీతుమీ 
  2.  మహిళల ఆసియా కప్

దంబుల్లా: మహిళల ఆసియాకప్ తుది అంకానికి చేరింది. నేడు జరగనున్న ఫైనల్లో భారత జట్టు శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన హర్మన్ సేన ఎనిమిదో సారి చాంపియన్‌గా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు లంక తొలిసారి ఆసియా కప్‌లో విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. లీగ్ దశ నుంచి ఓటమి ఎరుగని టీమిండియా అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టగా.. లంక కూడా అదే తరహాలో తుది పోరుకు చేరుకుంది.

భారత బ్యాటింగ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడు ప్రదర్శిస్తుండగా.. మిడిలార్డర్‌లో హేమలత, రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్, రిచా ఘోష్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్‌లు వికెట్లతో అదరగొడుతున్నారు. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్‌లతో పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు లంక కెప్టెన్ చమేరీ ఆటపట్టు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించడం లేదు. దీంతో ఆటపట్టు బ్యాటింగ్‌లో కీలకం కానుంది. పాక్‌తో జరిగిన సెమీస్‌లో ఆటపట్టు అర్ధ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించింది. ప్రియదర్శిని, కవిశా దిల్హరీ, అచిని కులసూరియా, ప్రబోధనిలతో కూడిన బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తోంది.