19-03-2025 12:00:00 AM
‘బంగారు పాప’ చిత్రం 19 మార్చి 1955లో విడుదలైంది. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, జగ్గయ్య, కృష్ణకుమారి, జమున ప్రధాన పాత్రల్లో నటించారు. వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీఎన్‌రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించారు. 3వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ‘బంగారు పాప’ తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా రాష్ట్రపతి రజత పతకాన్ని గెలుచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కోటయ్య (ఎస్వీ రంగారావు) చాలా మంచివాడు. ఆయన రామి అనే యువతిని వివాహం చేసుకుంటాడు. ఆమె గోపాలస్వామి అనే వ్యక్తి ఒత్తిడికి లొంగి భర్తను వదిలి అతనితో పారిపోతుంది.
ఆ తరువాత రామి, గోపాలస్వామి ప్లాన్ చేసి కోటయ్యను జైలుకు పంపుతారు. కోటయ్య జైలు నుంచి తిరిగొచ్చాక ఒక రౌడీగానూ.. తాగుబోతుగానూ మారతాడు. గోపాల స్వామిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. దీన్ని అమలు చేయాలని అనుకుంటుండగా ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది.
దీంతో అతని మానవత్వం ప్రతీకార దాహాన్ని అధిగమిస్తుంది. పాపను చూసుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభిస్తాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అసలు ఆ పాప ఎవరు? వంటి ఆసక్తికర అంశాలతో సినిమా రూపొందింది.