calender_icon.png 8 February, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తండేల్’తో విజయం మళ్లీ నన్ను చేరింది..!

07-02-2025 10:18:13 PM

సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో అక్కినేని నాగచైతన్య..

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజాచిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న విడుదలై ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో మంచి స్పందనతో ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజు ప్రేక్షకులు ఆదరించటంతో మూవీ టీమ్ శుక్రవారం రాత్రి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ‘సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది. చాలా కాలంగా ఇది మిస్ అయ్యాను. ఫైనల్‌గా మళ్లీ నాకు తిరిగివచ్చింది. నా పెర్ఫార్మెన్స్‌కి కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే సగం క్రెడిట్ దేవికి ఇవ్వాలి. అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు’ అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “తండేల్’ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని ముందే చెప్పాం. ఇందులో బెస్ట్ సర్‌ప్రైజ్ మా హీరో. దుల్లగొట్టేశాడు. మాకు ఇంకో హీరో దేవిశ్రీ ప్రసాద్. తన మ్యూజిక్ అదిరిపోయింది. మా అందరికీ ‘తండేల్’ డైరెక్టర్ చందు. శ్యామ్ దత్ విజువల్స్ ఆడియన్స్‌ను హత్తుకున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఇచ్చారు. ఈరోజు నుంచి పండగ మొదలవుతుంది” అని చెప్పారు. డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ.. ‘సినిమా చేస్తున్నప్పుడు ప్రతి సీన్‌కు థియేటర్‌లో ఎలాంటి రియాక్షన్ ఉంటుందని అనుకున్నానో అదే రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇక్కడ నుంచి మొదలైయింది.

అద్భుతంగా ముందుకు వెళుతుంది’ అన్నారు. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. ‘ఈ కథ వెనుక చాలా మంది ఉన్నారు. వారందరికీ ఒక సన్మాన కార్యక్రమం పెడతాం. వారి కష్టం మాకు తెలుసు’ అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘చై అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన నటన వలనే ఆర్‌ఆర్ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కథ విన్నప్పుడే మ్యాజికల్‌గా అనిపించింది. చందు అంతే అద్భుతంగా తీశారు. సాయిపల్లవి అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.