- వెంగళ్‌రావు హయాంలోనే మద్రాస్ నుంచి ఇక్కడికి..
- అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి మా పార్టీ నాయకుడే
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ ౨౩ (విజయక్రాంతి): తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడికి పోదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టంచేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌కు రావడంపై ఆయన స్పదించారు. చంద్రశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌కు వచ్చిన విషయం తనకు తెలియదని, ఆయన ఇక్కడికి వచ్చి బయటకు వెళ్లిపోయాక తనతో ఫోన్‌లో మాట్లాడారని, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారని తెలిపారు.
అల్లు అర్జున్‌పై తమ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని స్పష్టంచేశారు. చిత్ర పరిశ్రమ తరలిపోతుందన్న ప్రచారం తప్పన్నారు. ఇండస్ట్రీని మద్రాసు నుం చి ఇక్కడికి తీసుకొచ్చింది నాటి సీఎం జలగం వెంగళరావు హయంలోనేనని చెప్పారు. చిత్రపరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వానికి విడదీయరా ని బంధం ఉందని ఉద్ఘాటించారు.
అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి తమ పార్టీ నాయకుడే కాకుండా తనకు పాత మిత్రుడని చెప్పారు. తాము తప్పకుండా కలుసుకుంటామని, సమ స్య ఉంటే పరిష్కరించుకుంటామన్నారు. అల్లు అర్జున్ విషయంలో చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారన్నారు. చిత్రసీమ గురించి తెలియని కొందరు వ్యక్తులు ఈ ఘటనను రాజకీయంగా లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారని మండిపడ్దారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ లాఅండ్‌ఆర్డర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సినిమా పరిశ్రమను పుష్ప కూడా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందని, రాజకీయాలు మాట్లాడు తున్న వారు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.