calender_icon.png 22 December, 2024 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికి సినీ పరిశ్రమ ముఖ్యమే

22-12-2024 03:09:40 AM

  1. మా ప్రభుత్వానికి  సినీమావాళ్లంటే ఎలాంటి కోపం లేదు 
  2. శాంతిభద్రతలు కూడా ప్రధానమే 
  3. స్పీకర్‌ను ఇబ్బందిపెట్టినా.. సభ నుంచి ఎవరినీ సస్పెండ్ చేయలేదు 
  4. రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ఎంత పెద్ద హోదాలో ఉన్నా మాన వీయ కోణం మరిచిపోకూడదని రాష్ట్ర శాస న సభా వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. సినిమా వాళ్లంటే తమ ప్రభుత్వానికి ఎలాంటి కోపంలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కూడా ప్రధానమని అన్నారు.

రాష్ట్రానికి సినీ పరిశ్రమ ముఖ్యమని, సినీ పెద్దలు హీరో దగ్గరికి వెళ్లినట్లు, సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి పరామర్శిస్తే బాగుండేదని అన్నారు.  ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్పీకర్‌ను ఇబ్బంది పెట్టినా.. ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయకుండా అసెంబ్లీ నడిపామని మంత్రి  తెలిపారు.

ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన షార్ట్ డిస్కర్షన్ కూడా పరిగణలోకి తీసుకుని సభలో చర్చ చేశామని పేర్కొన్నారు. శనివారం శ్రీధర్‌బాబు సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్వోఆర్‌పై చర్చ జరిగిందని, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి వేశామన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని భూభారతిని తీసుకొచ్చామన్నారు.  గురుకుల పాఠశాలల్లో మౌళిక వసతులు, రాష్ట్ర అప్పులు, టూరిజం పాలసీ, రైతు భరోసాపై చర్చ చేశామని, తెలంగాణ తల్లి విగ్రహం,  చాకలి ఐలమ్మ  యూనివర్సిటీని ఏర్పాటు  చేశామన్నారు.

ప్రశ్నోత్తరా లకు జవాబుదారీతనంతో సమాధానం చెప్పామన్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బం ది జరగకుండా హైడ్రా ముందుకెళుతోందన్నారు. ఇక  రైతు బంధు అనేది ఉండదని, త్వరలోనే రైతు భరోసా ప్రారంభమవుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 

ప్రవర్తనలో మార్పురావాలి.. 

కొంతమంది సభ్యుల ప్రవర్తనలో మార్పు వస్తుందని అనుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. డిసెంబర్ 9కి ఒక ప్రత్యేకత ఉందని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను బీఆర్‌ఎస్ నేతలు మర్చిపోయారని ఆయన విమర్శించారు.  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పీకర్, మండలి చైర్మన్ కలిసి ఒరియెంటేషన్ క్లాసులు నిర్వహిస్తే.. బీఆర్‌ఎస్ సభ్యులు రాలేన్నారు. సభ పట్ల వారికున్న మర్యాద ఏమిటో కనపడుతోందని మండిపడ్డారు.