- ‘సంధ్య’ వివాదాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది
- భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ హయాంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందిందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి సినిమా పరిశ్రమతోపాటు అల్లు అర్జున్‌పై ఎలాంటి కోపం లేదన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై వాస్తవాలు ప్రజలకు తెలియాలనే అసెంబ్లీలో సీఎం మాట్లాడారని వివరించారు.
సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడు తూ.. మహిళ ప్రాణం పోతే.. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సమంజసం కాదని హితవుపలికారు. రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవకుంటే అల్లు అర్జున్ రియల్ హీరో అయ్యేవాడన్నారు. ఆయన ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు రిమాండ్‌కు పంపారని తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, అశ్వినీ వైష్ణవ్, లక్ష్మణ్ కలిసి పీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి బాధిత కుటుంబానికి రూ.కోటి ఇప్పించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ తప్పులేకుంటే రేవతి మృతికి కారణం ఎవరని ప్రశ్నించారు.
యూపీలో స్వామీజీ ప్రోగ్రాం తొక్కిసలాటలో 100 మంది చనిపోయారని, అక్కడ బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారనే విషయం మర్చిపోవద్దన్నారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికే కాంగ్రెస్ ప్రభుత్వం దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిందని చామల గుర్తు చేశారు.