calender_icon.png 10 March, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే

10-03-2025 05:00:22 PM

సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్..

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): మనువాదాన్ని ధిక్కరించి మహిళల అభ్యున్నతి కోసం పోరాడిన యోధురాలు సావిత్రిబాయి పూలే అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సావిత్రిబాయి ఎన్నో అవమానాలను ఎదుర్కొని తన భర్త జ్యోతిబాపూలే ప్రోత్సాహంతో చదువుకొని దేశంలో మొట్టమొదటి మహిళగా నిలిచారని కొనియాడారు. ప్రస్తుతం పాలకవర్గాలు మహిళల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కూషన రాజన్న, కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్, దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్ కుమార్, కార్తీక్, సాయి కృష్ణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.