04-04-2025 12:51:18 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 3: (విజయక్రాంతి) : నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం ఆగబోదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ వెల్లడించారు.
రెండవ ఏఎన్‌ఎంలకు ఏఐటియుసి ఆధ్వర్యంలో చేసిన సమ్మె సమయంలో ఆ తరువాత జరిగిన పోరాటాల సమయంలో వయసు రీత్యా పరీక్షకు అర్హత లేని వారిని 100 శాతం గ్రాస్ శాలరీతోపాటు 7 నెలల పీఆర్‌సీ వేతన బకాయిలు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, సబ్ సెంటర్ అద్దె బకాయలు, ఏవిడి వ్యాక్సిన్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.
ఈ మేరకు గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండవ ఏఎన్‌ఎంలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ మాట్లాడుతూ పీఆర్‌సీ అమల్లోకి వచ్చిన ఏడు నెలల తర్వాత జీతాలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వదులుకోవటానికి రెండవ ఏఎన్‌ఎంలు సిద్ధంగా లేరని, ఏఐటీయూసీ హామీలు నిర్వర్తించేంతవరకు వారి తరఫున పోరాటం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్‌ఎం ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు, సం ఘం అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు జక్కుల పద్మ, బోయిని శ్యామల, రాష్ట్ర కార్యదర్శులు తన్వీర్ సుల్తానా, పీ జయమ్మ, ఎస్ సంధ్యారాణి, ఉపాధ్యక్షులు కే. పద్మ తదితరులు పాల్గొన్నారు.