calender_icon.png 22 April, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటి నుంచే రిజర్వేషన్ల కోసం పోరాటం

22-04-2025 12:07:25 AM

  1. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంత రావు

మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలి

శాసనమండలి మాజీ చైర్మన్,  ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి

ముషీరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : ఇందిరా, రాహుల్ గాంధీ హ యాం నుండే మహిళల రిజర్వేషన్ల పోరాటం ఆనాటి నుండే వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి. హనుమంత రావు అన్నారు. ఈ మేరకు సోమవారం కాచిగూడలోని ఓ హోటల్ లో జాతీయ బీసీ మహిళా జేఏసీ సమావేశాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ మహిళా సంఘం జేఏసి ఛైర్మెన్ మట్ట జయంతి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యుడు వి. హనుమంత్ రావు, శాసన సభ మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ సిరికొండ  మధుసూదన చారి హాజరయ్యారు. ఈ సందర్భాంగా మాజీ ఎంపీ హనుమంత రావు మాట్లాడుతూ మహిళల 50 శాతంలో 33 శాతం సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలంతా కలసి ఢిల్లీలో ఎప్పుడైతే ధర్నా చేపడుతారో అప్పుడే అమలుకు నోచుకుంటాయన్నారు.

శాసన సభ మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ సిరికొండ  మధుసూదన చారి మాట్లాడుతూ దేశంలో సగభాగం ఉన్న మహిళలు కూడా రాజ్యాధికారం కోసం అన్ని రకాల కృషి చేసే వాతావరణం సృష్టించకపోవడం నేటి సమస్యలకు కారణం అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల కొన్ని కులాలకు మాత్రమే చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేదన్నారు.

శాశ్వతంగా అభివృద్ధికి దూరం చేయడమే వారి లక్ష్యంగా వాళ్ళు అధికారంలో కొనసాగడమే పరమార్ధంగా ఇప్పటివరకు సాగుతున్నాయని అన్నారు. మహిళలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, నాయకులు నందగోపాల్, డి వి రాజు, తేజ, విజయలక్ష్మి, శ్రీనివాస్, సుజాత, మంజు, సరోజ, శివమ్మ, విజయ్, రాఘవేంద్ర, ఉదయ్ నేత, మహిళా సంఘాల నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.