జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ మంథని సామెల్ మాదిగ...
కామారెడ్డి (విజయక్రాంతి): డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరులో తాడోపేడో తేల్చుకునేందుకే ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7న ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మార్పీఎస్ కార్యకర్తపై ఉందని జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి మంథని సామెల్ మాదిగ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహా సమావేశాలలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న కామారెడ్డి జిల్లాకు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ రానున్నారని దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు. ఒక వర్గం నుండి మరో వర్గానికి జరుగుతున్న పోరులో తమ సత్తాను చాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు గ్రామ గ్రామాలలో మాదిగలను చైతన్యవంతం చేయాలని సూచించారు.
లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి ప్రతి ఒక భుజానికి ఒక డప్పు సంకన వేసుకొని సమావేశానికి హాజరైవిజయవంతం చేయాలన్నారు. ఈపాటికి మండలాలలో నియోజకవర్గాలలో సన్నాహా కార్యక్రమాలు నిర్వహించామని ఇంకా పూర్తి కమిటీలను ఏర్పాటు చేసి ఫిబ్రవరి 7న పూర్తిగా కమిటీలు ఏర్పాటుచేసి హైదరాబాద్ తరలించే విధంగా చూడాలని అన్నారు. ఇంటికొక్క డప్పు తీసుకొని యువకులను కదిలించే బాధ్యతలో సైతం నాయకులు చోరువ తీసుకోవాలని సూచించారు. మాదిగ ఉపకాలాలను సైతం కదిలించే విధంగా ముఖ్య నాయకులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని బాధ్యతలు తీసుకొని ఉప కులాలను సైతం బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు కష్టపడ్డాడు మనమందరం 30 రోజుల కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బట్టు వెంకట్ రాములు మహిళా అధ్యక్షురాలు లక్ష్మి సీనియర్ నాయకులు కుంటోళ్ల యాదయ్య, గోరుగల్లు బాలరాజు, కొత్తల్ల యాదగిరి, బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు బాలరాజు, గడ్డం సంపత్, సాయిలు, రమేష్ పురుషోత్తం రాజనర్సయ్య బట్టు నరేష్, దాకయ్య గణేష్ భూపతి తదితరులు పాల్గొన్నారు.