17-12-2024 12:47:00 AM
ఆరో రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె
కుమ్రంభీం ఆసిఫాబాద్/జనగామ/నిర్మల్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఆరో రోజుకు చేరింది. పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు ప్రతి పక్షనేతగా ఉన్న రేవంత్ రెడ్డి.. తాము అధికారంలోకి వస్తే 5 నిమిషాల్లోనే రెగ్యులర్ చేసి వారి డిమాండ్‌లను పరిష్కరిస్తానని హమీ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా తమకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ, యూఆర్‌ఎస్ పాఠశాలల ఉద్యోగులు సమ్మె చేపపడు తుండ టంతో ఆయా పాఠశాలల్లో విద్యాబోధనపై పెద్ద ప్రభావం పడుతున్నది.
ఇతర సిబ్బందితో విద్యను అందిస్తున్నప్పటికీ అన్ని సబ్జె క్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్య విద్యార్థులకు అందడంలేదు. కాగా నిర్మల్‌లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు గంగాధర్, ఎజా జ్ సూజాత, అపర్ణ, లిఖిత, నవిత, హరీశ్, వీణా పాల్గొన్నారు. జనగామలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలు సోమవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. సుమారు 150 మం ది దీక్షలో పాల్గొని రోజుకో తీరులో తమ నిరసన తెలుపుతున్నారు. రోడ్లను ఊడ్చడం, ఒంటి కాలు, మోకాలుపై నిల్చుని వినూత్నంగా నిరసనలు తెలిపారు. వీరికి పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.