calender_icon.png 11 February, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంప్‌యార్డు వ్యతిరేక పోరు ఉధృతం

11-02-2025 01:01:47 AM

  1. ఆందోళనలు చేపట్టిన మహిళలు
  2. గుమ్మడిదలలో భారీ ర్యాలీ, నిరసన
  3. జేఏసీ ఆధ్వర్యంలో పోస్టల్ కార్డు ఉద్యమం

పటాన్‌చెరు, ఫిబ్రవరి 10: నల్లవల్లి ప్యారానగర్ గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న డంప్‌యార్డుకు వ్యతిరేకంగా గుమ్మడిదల మండల ప్రజలు చేపట్టిన నిరసనలు సోమవారం నాటికి ఆరో రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో గ్రామస్థుల రిలే నిరాహార దీక్షలు సోమవారం ఆరో రోజు కు చేరుకున్నాయి.

డంప్‌యార్డును నిలిపేసి పర్యావరణాన్ని, ప్రజలను, వన్యప్రాణులను కాపాడాలని కోరుతూ నల్లవల్లి జేఏసీ పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టింది. ప్రధాని మోదీకి వెయ్యి, సీఎం రేవంత్‌రెడ్డికి వెయ్యి, గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెయ్యి పోస్టుకార్డులు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుమ్మడిదలలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో అఖిల పక్ష నాయకులు, ప్రజలు రోడ్డెక్కారు.

మరో వైపు మహిళలు డంప్‌యార్డు ఏర్పాటును నిరసిస్తూ కదం తొక్కారు. సేవ్ పీపుల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వందల మంది మహిళలు జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. నిరసనలు కొనసాగు తుండగానే పోలీ సు బందోబస్తు మధ్య డంప్‌యార్డు నిర్మాణం పనులు జరుగుతూనే ఉన్నాయి.