calender_icon.png 23 October, 2024 | 12:24 AM

రహస్యాల ఐదో వేదం

19-10-2024 12:00:00 AM

అభిరామి మీడియా వర్క్స్ పతాకంపై అభిరామి రామనాథన్, నల్లమై రామనాథన్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘ఐందామ్ వేదం’. దీన్ని ఎల్ నాగరాజన్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో సాయి ధన్సిక, సంతో ష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వైజీ మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ ముఖ్య పాత్రలను పోషించారు. అక్టోబర్ 25న జీ5 ద్వారా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందు కు రానున్న నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా దీన్ని రిలీజ్ చేయించారు.

వెయ్యేళ్లకోసారి గురుడు, శుక్రుడు, శని, కుజుడు.. ఈ నాలుగు గ్రహాలు.. సూర్యుడ్ని చూసేలా ఒకే వరుసలో ఉంటాయట. అలా జరిగినప్పుడు అద్భుతం జరుగుతుందని చరిత్ర చెబుతుంది. నాలుగు వేదాలున్నాయి.. ఐదో వేదం ఇప్పుడు బయటకు రాబోతోంది’ అంటూ తెలుగు డైలాగ్స్‌తో సాగే ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలను చూపించబోతోన్నట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్, సోషియో ఫాంటసీ.. ఇలా అన్నింటినీ కలిపి దర్శకుడు నాగ ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు కెమెరా: శ్రీనివాసన్ దేవరాజన్; సంగీతం: రేవా.