21-02-2025 04:59:25 PM
ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ పిలుపు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఈనెల 23న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 5వ మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్షులు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గౌరవ సలహాదారులు చామకూర రాజు, కేవీ గౌడ్, శ్యాంసుందర్ గౌడ్ లతో కలిసి ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో 40,500 మంది కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ఉన్నారని, ఈ కార్మికులను గ్యాస్ ఏజెన్సీలు శ్రమ దోపిడీ గురి చేస్తున్నాయని ఆరోపించారు.
కార్మికులకు కొన్ని ఏజెన్సీలు కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ అధికారులు, సివిల్ సప్లై అధికారులు కుకింగ్ వర్కర్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధాన కార్య దర్శి చంద్రయ్య, ఉపాధ్యక్షుడు ఎండీ. యూనుస్, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.