calender_icon.png 30 September, 2024 | 9:02 AM

‘సోయ’ కొనుగోళ్లకు రంగం సిద్ధం

30-09-2024 02:36:14 AM

నిర్మల్ జిల్లాలో 5 కేంద్రాలు 

నిర్మల్, సెప్టెంబర్ 29(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సోయ పంట కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో వానాకాలంలో మొత్తం సాగు విస్తీర్ణం 4.50 లక్షల ఎకరాలు కాగా పత్తి 1.75 లక్షల ఎరకాలు, సోయ 1.60 లక్షలు,  వరి 1.40 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ముధోల్, భైంసా, కుంటాల, కుబీర్, తానూర్, లోకేశ్వర్, దిలువార్‌పూర్, సారంగపూర్, బాసర, పెంబి, దస్తురాబాద్, మామాద నర్సాపూర్ మండలాల్లో ఎక్కువగా సోయను సాగు చేస్తారు.

జూన్‌లో వేసిన సోయ పంట ఇప్పటి వరకు చేతికి రావడంతో కొనుగోలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కుంటాల, కుబీర్, తానూర్, ముధోల్, భైంసాలో అక్టోబర్ 2న కోనుగోలు కేంద్రాలను ప్రాంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సోయ పంటకు మద్దుతు ధరను రూ.4,890 గా నిర్ణయించింది.