26-04-2025 12:00:00 AM
నిర్మల్ ఏప్రిల్ 25( విజయ క్రాంతి) : కొడుకు ప్రయోజకుడు అవుతాడని నమ్మిన తండ్రికి ఆ కొడుక్కి తండ్రితో తరచుగా గొడవలు పెట్టుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి కన్న కొడుకును హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
లక్ష్మణ్ చందా మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెం దిన వైరా ఎర్రన్నకు మారుడైన వైరా అశోక్ (32) కొన్ని రోజులుగా తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవకు దారితీయగా పెద్దల సమక్షంలో పంచాయతీ కుదించినప్పటికీ గొడవలు ఆగలేదు. దీంతో కొడు కును చంపాలన్న ఉద్దేశంతో తండ్రి ఎర్రన్న శుక్రవారం ఇంటి బయట నిద్రిస్తున్న కుమారుడు అశోక్ పై గొడ్డలితో విచక్షణ రైతంగా దాడి చేయడంతో అక్కడి కక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
హత్య చేసిన ఎర్రన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేష న్కు వెళ్లి లొంగిపోయినట్టు స్థానిక ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రాకేష్ మీనా రూరల్ సీఐ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేశారు.