calender_icon.png 22 December, 2024 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండగ పూట పిల్లలతో కలిసి బావిలో దూకి తండ్రి ఆత్మహత్య

13-10-2024 11:36:45 AM

కొత్త బట్టలు వేసుకొని పాలపిట్టను చూసేందుకు వెళ్లి

ఇంటికి తిరిగిరాని తండ్రి కొడుకులు

గాలింపు చర్యలు చేపట్టిన గ్రామస్తులు

బావిలో శవాలుగా మారిన పిల్లలు

కామారెడ్డి (విజయక్రాంతి): కుటుంబ కలహాలు క్షణికావేశంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలో వేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విధారక విషాద సంఘటన కామారెడ్డి జిల్లా నందివాడలో శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన చిట్టేపు శ్రీనివాస్ రెడ్డి ఇల్లరికం వచ్చాడు. అత్తమామలు భార్య సరిగా చూడకపోవడంతో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో విసిగి వేసారిన శ్రీనివాస్ రెడ్డి కలత చెంది తన పిల్లలు విగ్నేష్ 7 సంవత్సరాలు అనిరుద్ 5 ఐదు సంవత్సరాలు పిల్లలతో కలిసి దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో నుంచి పాలపిట్టను చూసేందుకు శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లారు రాత్రి అయిన ఇంటికి తండ్రి కొడుకులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెతకడం ప్రారంభించారు.

గ్రామ సమీపంలోని ఓ బావిలో శ్రీనివాస్ రెడ్డి కుమారుల మృతదేహాలు  తేలడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి మృతదేహం మాత్రం లభించలేదు. అతని చెప్పులు బట్టలు బావి ఒడ్డుపైన కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. పండగ పూట నందివాడలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్ రెడ్డి మృతి చెందడం ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తన కుమారులను కూడా బావిలో వేసి చనిపోవడం కుటుంబ సభ్యులను గ్రామస్తులను కండతడి పెట్టించింది. శ్రీనివాస్ రెడ్డికి చనిపోవాల్సినంత ఇబ్బందులు ఏం లేవని గ్రామస్తులు అంటున్నారు. తన పిల్లల జ్ఞాపకాలను చెప్పుకుంటూ తల్లి రోధించడం గ్రామస్తులను కంటి తడి  పెట్టించింది.