మహబూబ్ నగర్ జనవరి 12 (విజయ క్రాంతి) : రాసే రాతలతో నిరుపేదల తలరాత మారాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
సమాజానికి మంచి జరిగేలా దినపత్రికలో కథనాలు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, విజయ క్రాంతి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి జిల్లెల రఘు, అడ్వర్టైజ్మెంట్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ డి మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు జాజిమొగ్గ నరసింహులు, శాంతయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.