calender_icon.png 15 November, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదంలో ఫార్మాసిటీ భవితవ్యం

12-11-2024 12:07:19 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ర్టంలో పరిపాలనా, శాంతి భద్రతల వైఫల్యానికి కొడంగల్‌లో జిల్లా కలెక్టర్ మీద రైతులు తిరగబడ్డ ఘటనే మంచి ఉదాహరణ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పంచారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వంతో అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృ ష్టకరమన్నారు.

భూసేకరణ పూర్తయి అన్ని అనుమతులు వచ్చి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని రద్దుచేసి.. రాష్ర్టంలో పదిచోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ ఆలో చనతో ఇంత అలజడి రేగిందని’ అని కేటీఆర్ విమర్శించారు. ఫార్మా సిటీకోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ముచే సుకుందామనుకున్న రేవంత్ కుటిల బుద్ధితో ఫార్మాసిటీ భవితవ్యం ప్రమాదంలో పడిందన్నారు.

ఈ క్రమంలోనే కొడంగల్‌లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైందన్నారు. రాష్ర్టంలో అన్నివర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం, చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోందని.. అది ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుందని కేటీఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.