calender_icon.png 29 April, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ ఫాసిస్ట్ విధానం నశించాలి

29-04-2025 04:49:02 PM

ఐఎఫ్టియు నిర్మల్ జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్...

ఖానాపూర్ (విజయక్రాంతి): దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానం నశించాలని, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఐఎఫ్టియు నిర్మల్ జిల్లా అధ్యక్షులు సునారికాడి రాజేష్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామ బీడీ పరిశ్రమ ప్రధాన కేంద్రంలో మేడే పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ఆధిపతులు అంబానీ, ఆదానిలకు ప్రజా సంపద కట్టబెట్టేందుకు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను తెచ్చి కార్మిక వర్గానికి మరణ శాసనం విధించారని, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అన్యాయాన్ని ప్రశ్నిస్తే కార్మికులను నిర్బంధిస్తుందని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేయడం మానుకోవాలని, సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం నెలకు 26000, అసంఘటిత రంగ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్, బీడీ కార్మికులందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, బీడీ పరిశ్రమపై జీఎస్టీ రద్దు చేయాలని, పలు డిమాండ్లు చేశారు.

ఈ కార్యక్రమంలో బీడీ ప్యాకర్స్ యూనియన్ అధ్యక్షులు సాట్ల భోజన్న, కార్యదర్శి రామ్మోహన్, కోశాధికారి పంబాల రాజేశ్వర్, దాసరి పెద్దన్న, ఆత్రం భీమ్రావు, శ్రీనివాస్, మడికే శేఖర్ తదితరులు ఉన్నారు.