calender_icon.png 26 December, 2024 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతును పరామర్శ

02-12-2024 07:32:07 PM

కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేదు.... అరాచకం రాజ్యమేలుతుంది.

అధికారులు ఒత్తిడులకు లోనుకాకుండా చట్టపరిధిలో పని చేయాలి.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఎదుట్ల గ్రామానికి చెందిన సాయిరెడ్డి అనే తన భూమి ఆక్రమించి ఇబ్బందులకు గురిచేయడం వల్ల ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగడం లేదని తీవ్ర ఆవేదన చెంది ప్రజావాణిలో కలెక్టర్ ఎదురుగా మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సాయిరెడ్డిని పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని ఓదార్చారు. వైద్యులను అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ....  కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు కరువైనాయని ఒకవైపు రైతు పండుగ సంబరాలు జరుగుతుంటే మరోవైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

సాయిరెడ్డి న్యాయం కోసం పలుమార్లు పోలీసుల చుట్టూ తిరిగిన అధికార పార్టీ వారి ఒత్తిడులకు గురై పోలీసులు తనకు న్యాయం చేయకపోగా వేధించడం వల్ల, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల భూమి పట్టా ఉన్నా సాగు చేయకుండా దాయాదులు దౌర్జన్యం చేయడం వల్ల విసిగి వేసారి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారని ఇది దురదృష్టకరమన్నారు. అధికారులు అధికార పార్టీ ఆదేశాలు రాష్ట్రపతి హుకూం లాగా పనిచేస్తున్నారని సివిల్ పంచాయితీలలో పోలీసులు కలగజేసుకోవడం వంటి చర్యలకు పాల్పడకుండా చట్టపరిదిలో పనిచేయాలన్నారు. జిల్లా మంత్రి కృష్ణారావు  సొంత గ్రామములో వేలాది క్వింటాల ధాన్యం మాయమైతే దిక్కులేదని, అదేవిధంగా చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో శ్రీధర్ రెడ్డి హత్య జరిగితే నేటికీ దోషులను పట్టుకోలేదు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించడం వంటి చర్యలకు మంత్రి చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఊరి ఊరికి షాడో ఎమ్మెల్యే లు తయారై ప్రజలను వేధించడం వల్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని వెంటనే ప్రభుత్వం,అధికారులు స్పందించి సాయి రెడ్డికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ మంత్రి ఆసుపత్రిలోని వార్డులో తిరిగి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెంట పి.రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, చిట్యాల రాము, రవికుమార్, నాగేంద్రము తదితరులు ఉన్నారు.